Thursday, 5 November 2026

హుజూర్ నగర్ నియోజకవర్గ రోడ్లకు మహర్దశ

హుజూర్ నగర్ నియోజకవర్గ రోడ్లకు మహర్దశ
– పూర్తి అవుతున్న ఎన్నికల హామీలు – తిరనున్న ప్రజల చిరకాల స్వప్నాలు – ఎమ్మెల్యే సైదిరెడ్డి
హుజూర్ నగర్ డిసెంబర్ 8 (జనంసాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అద్భుత కృషి ఫలితము ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ రహదారుల నిధుల మొత్తంలో సింహభాగం హుజూర్ నగర్ నియోజకవర్గ రోడ్లకే దక్కిందని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 అసెంబ్లీ నియోజకవర్గం రహదారులకు సంబంధించి 864.99 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా…అందులో అధిక మొత్తం 35 కోట్ల సింహ భాగాన్ని హుజూర్ నగర్ నియోజక వర్గ రహదారులకు చెందేలా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఒప్పించుకొని తన స్వంత హుజూర్ నగర్ నియోజకవర్గ రహదారులను అత్యాధునికంగా, నాణ్యతాపరంగా నిర్మించి చరిత్రను తిరగరాస్తున్నారన్నారు. నిరంతరం ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తూ సీఎం కెసిఆర్ ని ఒప్పిస్తూ మెప్పిస్తూ అనేక అభివృద్ధి పథకాలకు వేల కోట్ల రూపాయల నిధులు తెస్తున్న హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తన అద్భుతమైనటువంటి పనితనంతో పరిపాలన దక్షతతో పటిష్టమైన నాయకత్వంతో ఒకవైపు అభివృద్ధిని, మరొకవైపు సంక్షేమాన్ని ప్రతి ఇంటి ఇంటికి తీసుకొని వెళుతూ శరవేగంగా అభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రజలకు చేసి చూపిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కి ప్రజలు జేజేలు కొడుతూ రహదారుల అధునాతన నిర్మాణానికి వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన ఎమ్మెల్యే సైదిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.