కాకినాడ : దమ్మంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర బూటకపు యాత్ర అని… చిత్తశుద్ది ఉంటే అమరణ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు.




