కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 01 సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు జె. రామకృష్ణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కంటోన్మెంట్ అభివద్ధికి ఈ సారి తమ బడ్జెట్లో 320 కోట్లు బోర్డు కేటాయిస్తోందని తెలియజేశారు. ఇందులో దాదాపు గత సంవత్సరం కంటే 70కోట్ల వరకు అదనంగా ఈసారి కేటాయించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు అని అన్నారు.కంటోన్మెంట్ బోర్డ్ కు రావాల్సిన కోట్ల రూపాయల టీపీటీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకొని వాటిని విడుదల చేయడంలో నిరక్ష్యం చేస్తోందన్నారు. తక్షణమే నిధులు విడుదల చేస్తే ఇక్కడి రోడ్లు,ఓపెన్ నాలాలు, బోయినపల్లి లో రామన్నకుంట, తిరుమలగిరి చెరువులు అభివృద్ధికి కేటాయిస్తామన్నారుతెలియజేశారు.కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్లు కేటాయించాలన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు.దమ్ముంటే అభివృద్ధి పనుల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించారో మంత్రులు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖరాసినట్లు రామకృష్ణ తెలిపారు.దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేస్తున్న ప్రభుత్వం ఈ దశాబ్ద కాలంలో కంటోన్మెంటు చేసిందే ఏమిలేదు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.




