దమ్ముంటే విూ రాష్టాల్ల్రో దళితబంధు అమలు చేయండి


కాంగ్రెస్‌, బిజెపిలకు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సవాల్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళితబంధుపై ప్రతిపక్షాలు ఊరకుక్కలాగ అరుస్తున్నారని పీయూసీ చైర్మన్‌ జీవన్‌ రెడ్డి అన్నారు. ఓ మంచి కార్యక్రమాన్ని స్వాగతించలేని దౌర్భాగ్యులన్నారు. ఇదేనా వీరికి దళితులపై ఉన్న ప్రేమ అని అన్నారు. దమ్ముంటే బీజేపీ`కాంగ్రేస్‌ పాలిత రాష్టాల్ల్రో దళితబంధు ప్రకటించి అమలు చేసి మాట్లాడాలి సవాల్‌ విసిరారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌, బీజేపీ నేతలు అరవింద్‌, బండి సంజయ్‌పైతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పై విమర్శలు చేసేవాళ్ళు బ్రోకర్‌` జోకర్‌` లోఫర్‌ గాళ్ళు మాత్రమే అని అన్నారు. బ్రోకర్‌ రేవంత్‌ రెడ్డి, జోకర్‌ అరవింద్‌, లోఫర్‌ బండి సంజయ్‌ అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.బండి సంజయ్‌` రేవంత్‌కు దమ్ముంటే రాబోయే రోజుల్లో దళితబంధు ఇస్తామని మోడీ` రాహుల్‌ గాంధీతో ప్రకటన చేయించాలన్నారు. రాబోయే రోజుల్లో గాంధీ భవన్‌కు టులెట్‌ బోర్డు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారని జీవన్‌ రెడ్డ యెద్దేవా చేశారు.