Wednesday, 4 November 2026

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న పుట్ట

 

 

 

 

 

 

దంపతులు జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆదివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని.. పాడి పంటలతో మంథని ప్రాంతం సుభిక్షంగా ఉండేలా శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు ఈ సందర్భంగా కోరుకున్నారు.