Thursday, 5 November 2026

దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్డ్ అందాలి

దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్డ్ అందాలి

మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్ 28(జనంసాక్షి

ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్డ్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మర్ రివిజన్ కార్యక్రమం కింద చేపట్టిన ఓటరు జాబితా పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ ద్వారా పంపిణీ అయినా 15 941 కార్డులలో ఓటర్లకు చేరిన కార్డుల సంఖ్య మండలాల వారీగా నియోజకవర్గ వారీగా నివేదిక ఇవ్వాలన్నారు. దివ్యాంగులలో 18 సంవత్సరముల పైబడిన ఓటర్ల వివరాలు ఇవ్వాలన్నారు. ప్రతి నెల క్రింది స్థాయిలో ఓటర్ల జాబితా పై సమీక్షించాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ కేంద్రాల వారీగా నియమించిన బిఎల్వోలు గా శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలన్నారు మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఫారం-7 దరఖాస్తు ఫారాలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. జనవరి మూడవ తేదీ లోగా ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ ఆదనపు కలెక్టర్ డేవిడ్, మహబూబాబాద్ తొర్రూరు ఆర్ డి ఓ లు కొమరయ్య, రమేష్, తాసిల్దార్లు, ఎలక్షన్ సెక్షన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.