దేవుని దర్శనం కోసం వచ్చి యువకుడు దుర్మరణం పాలైన దుర్ఘటన నంగునూరు మండల కేంద్రం నల్లపోచమ్మ దేవాలయం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రాజగోపాల్ పేట ఎస్సై మహిపాల్ రెడ్డి, మృతుడి బావ రమేష్ తెలిపిన కథనం ప్రకారం…. హుస్నాబాద్ కు చెందిన తాళ్ల నాగరాజు(26) చేర్యాలలో ఉన్న తన స్నేహితుడు గణేష్ తో కలిసి నంగునూరు నల్లపోచమ్మ దేవాలయానికి దర్శనం నిమిత్తం వచ్చి తిరిగి చేర్యాలకు వెళుతున్న క్రమంలో బైకును అతి వేగంగా నడపడం వలన అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా గణేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. దర్శనానికి దుర్మరణం చెందడంతో నాగరాజు కుటుంబంలో విషాదం నెలకొంది.




