దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం…

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…
గద్వాల ప్రతినిధి నవంబర్ 11 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాల  దళిత బంధు లబ్ధిదారులకు  ఎంపికైన అయినా ను 10 లక్షల వ్యయంతో ట్రాక్టర్ తీసుకొని వారి  ట్రాలీ లను  గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి   చేతుల మీదుగా లబ్ధిదారునికి  అందజేయడం జరిగినది..ఎమ్మెల్యే మాట్లాడుతూ….ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రి కి రాని  ఆలోచనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి రావడం జరిగింది దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని  దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితులు గతంలో ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ గారు అని అన్నారు..భవిష్యత్తులో దళిత బంధు ద్వారా ప్రతి ఒక్క దళిత బిడ్డ అభివృద్ధి చెందాలని కోరారు..ఈ కార్యక్రమంలో  ఎంపీపీ విజయ్ ,జెడ్ పి టి సి రాజశేఖర్,  ట్రాక్టర్ షోరూమ్ ప్రొ.శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.