Tuesday, 3 November 2026

దళితుల అభ్యున్నతికి కోసం కృషి చేసి నాయకుడు కేసీఆర్ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

జులై, 2 (జనంసాక్షి ) గట్టుగట్టు మండలం పరిధిలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన నర్సింహులు కి దళిత బంధు లబ్ధిదారులకు ఎంపికైన అయినా ను 10 లక్షల వ్యయంతో శివ కోళ్ల ఫారం మంజూరు కావడం జరిగినది యూనిట్ ని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఆదివారం ప్రారంభించారుఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి లబ్ధిదారులు నర్సింహులు దంపతులు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు
ఈసందర్బముగాఎమ్మెల్యే మాట్లాడుతూ.గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు దళితుల కోసం దళిత బంధం ప్రవేశపెట్టడం జరిగినది.ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రి కి రాని ఆలోచనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి రావడం జరిగింది దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితులు గతంలో ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.దళిత బంధు ద్వారా ప్రతి ఒక్క దళిత బిడ్డ అభివృద్ధి చెందాలని ఆర్థికంగా ఎదగాలని అన్నది ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్ , PACS ఛైర్మన్ వెంకటేష్, గట్టు మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బజారి, ఆలీ, శేఖర్, హనుమంతు, మధుసూదన్ రెడ్డి, జయన్న, ఆనంద్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.