మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై2మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో చేపట్టిన మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను మల్కాజిగిరి టియుడబ్ల్యూజే 143, ఐజేయు నాయకులు ఆదివారం పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ భవనానికి ప్రతి ఒక్క జర్నలిస్టు కృషి చేయాలని కోరారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాదిరిగా జర్నలిస్టులకు ఉపయోగపడేలా క్లబ్ హౌస్,మీడియా హౌస్,ప్రెస్ కౌన్సిల్ హాల్ తదితర సౌకర్యాలతో రానున్న తరాలకు అత్యాధునిక ప్రెస్ క్లబ్ ను నిర్మించే దిశగా అడుగులు వేయాలని జర్నలిస్ట్ నాయకులు పేర్కొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారాన్ని జర్నలిస్టులు మర్చిపోలేరని తెలిపారు.ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పరితపిస్తూ జర్నలిస్టుల సహకారానికి ఎల్లవేళలా నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రెస్ క్లబ్ భవనాన్ని త్వరితగతిన పూర్తయ్యేలా యూనియన్లకు,గ్రూపు రాజకీయాలకు, ఆధిపత్య పోరులకు అతీతంగా జర్నలిస్టులు కృషి చేయాలని వారు కోరారు.ఎలాంటి అపోహలను మనసులో పెట్టుకోకుండా ప్రెస్ క్లబ్ నిర్మాణమే ఎజెండగా సోమవారం జరిగే సమావేశానికి జర్నలిస్టులందరూ కలిసి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా నాయకులు గుండ్ల మహేష్ గౌడ్, టీయూడబ్ల్యూజే ఐజేయు మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షుడు బాలాజీ, టీయూడబ్ల్యూజే143 ప్రధాన కార్యదర్శి గడ్డమీది గిరి గౌడ్,ఉపాధ్యక్షులు అక్కల రాజు గౌడ్,దుషెట్టీ పాండు గౌడ్,గౌరవ అధ్యక్షుడు మురళి యాదవ్,సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్,సభ్యులు మనోజ్ గౌడ్,టియు డబ్ల్యూజే ఐజేయు నాయకులు ప్రశాంత్,శివ,నరేష్,రమేష్ తదితులు పాల్గోన్నారు.
మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన జర్నలిస్టు నాయకులు.




