దళితుల పై దాడులను ఖండించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి
కొండమల్లేపల్లి డిసెంబర్ 26 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ పట్టణంలో మాల మహానాడు నాయకుల కార్యక్రమం డాక్టర్ ఏకుల రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్సీలపై దాడులను జరగకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై ప్రజలందరిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రజలందరూ సమాజంలో సమానమని సమాజంలో అన్ని కులాల వారు కలిసిమెలసి మెలగాలన్నారు, అలా చూసే బాధ్యత పోలీసు వ్యవస్థ పై ఉందన్నారు. దేవరకొండ డివిజన్ చందంపేట గ్రామంలో జరిగిన గోకమల్ల ఆంజనేయులు పైన జరిగిన దాడిని మల మహానాడు జాతీయ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. ఈ కేసులోని దోషులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు. ఇలాంటి దాడులను జరగకుండా పోలీసు వ్యవస్థ పని చేయాలన్నారు. ఇలాంటి కేసులలో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు పోలీస్ వారిపై ఉండకూడదని డిమాండ్ చేశారు.
మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు మాల మహానాడు డివిజన్ ఎన్నికలు
అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ మాలల ఐక్యత, రాజ్యాధికారం దిశగా నూతన మాల మహానాడు కమిటీల ఏర్పాటులో భాగంగా దేవరకొండ డివిజన్ మాల మహానాడు నూతన కమిటీ జనవరి 11 న ఏర్పాటు చేయబడునని తెలిపారు. ఆరోజు మాలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుంది కావున కార్యక్రమానికి మాలలందరూ పాల్గొనాలని కోరారు. నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతామర్జున్, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు నాగటి జోసెఫ్, కురుమెట్ ల శ్రీను, పెరుమలహరి, యేకుల సురేష్, చలి చీమల పర్వతాలు, బోయిని చంద్రమౌళి, మేడ సైదులు, యేకుల అంబేద్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు




