దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి.
-దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు పంగిడి చెరువు వెంకటస్వామి
-ఎమ్మెల్యేకు జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం
వినతిపత్రం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్21 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో దళిత జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు పంగిడి చెరువు వెంకటస్వామి మాట్లాడుతూ దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలోని ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలిసి దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం మంజూరు చేసే విధంగా ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు అందులో భాగంగానే నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.రాష్ట్రంలో దళిత జర్నలిస్టులు ఎందరో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని,వారందరినీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఆదుకొని ఆర్థికంగా దళితులు అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిగళ్ళ సుదర్శన్, నాయకులు బంగారయ్య తదితరులు ఉన్నారు.




