Saturday, 7 November 2026

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
ఫొటో : సమావేశం లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, డిసెంబర్ 21, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలంలో బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మన ఊరు-మన బడి, మనబస్తి-మనబడి కార్యక్రమం కింద రూ. 70 లక్షల రూపాయలతో నిర్మించే డైనింగ్ హల్, అదనపు తరగతి గది, మేజర్, మైనర్ రిపేర్లు, ఫ్లోరింగ్ రిపేర్, కరెంటు సౌకర్యం, తాగునీటి సదుపాయం పనులకు శంకుస్థాపన చేశారు. జన్కపూర్ గ్రామంలో రూ. 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సృజన, మార్కెట్ కమిటీ చైర్మన్ బోనగిరి నిరంజన్ గుప్తా, జడ్పీటీసీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.