:- దళిత జాతి ఉత్తరణకే దళిత బంధు పథకం.
:- బీసీల కు ఒక్కో కుటుంబానికి లక్ష.
:- మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ మోడల్ ను కోరుతున్నరు.
:- ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ సక్సెస్.
నాగర్ కర్నూల్ బ్యూరో,జూన్ 6 (జనంసాక్షి):
తెలంగాణ ప్రజలే నా బంధు బలగం, తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్ర ఉందని గతంలో తాగునీటికీ సాగునీటికి హరిగోశపడుతుండేవారని గతంలో వరసలకు వలసలకు వలసలు కరువులకు నిలయంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం బ్రహ్మాండమైన అద్భుతాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం మరియు జిల్లా ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, ఉయ్యాలవాడ సమీపంలోని మెడికల్ కళాశాల శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వెలుమ ఫంక్షన్ హాల్ ప్రక్కన ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భారీగా ప్రజలు కార్యకర్తలు తరలిరావడంతో విజయవంతమైంది.ఈ సభకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతో నాగర్కర్నూల్ జిల్లాగా ఏర్పడిందని అన్నారు.తెలంగాణ రాకుంటే జిల్లా కలెక్టరేట్ అయ్యేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చాలా వెనకబాటుతనం ఉండేదని, ప్రజలు అరిగోస పడుతుండేవారని,పాలమూరు ఎంపీగా పోటీ చేశానని అప్పుడు ఉద్యమం బలంగా లేదని అన్నారు.ఉద్యమ చరిత్రలో పాలమూరు పేరు కీర్తి కిరీటంలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు.తెలంగాణ సాధించాక అభివృద్ధి లో అగ్రభాగాన ఉన్నామని హర్షం వ్యక్తం చేశారు.దేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచామని తెలిపారు. కరెంటు వస్తదో, రాదో అన్న పరిస్థితి నుంచి కరెంటు ఉత్పత్తి లో మనమే నెంబర్ వన్ అని అన్నారు.దళితజాతి ఉద్దరణకు ప్రపంచంలో లేని విధంగా దళితబంధు పథకంను ప్రవేశపెట్టిన జరిగింది అన్నారు. పాలమూరు జిల్లాలో ఆనాడు గంజికేంద్రాలు ఉండేవని నేడు పాలుగారిన పాలమూరులో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పడ్డాయని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5మెడికల్ కాలేజీలు వస్తాయని ఎప్పుడన్న జీవితంలో అనుకున్నమా అని అన్నారు. నాగర్ కర్నూల్ కు మెడికల్ కళాశాల కావాలని నా దగ్గరకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తుపాకీ గుండులా వచ్చిండని, ముఖం ముడిచి కూర్చుంటే అప్పటికప్పుడు మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నాడు 60 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ హయాంలో మరియు టిడిపి బిజెపి కూటమి పాలనలో
కనీసం మంచినీళ్ళు ఇయ్యలే, మెడికల్ కాలేజీ ఇయ్యలే అని అన్నారు.
కల్వకుర్తి, భీమ, నెట్టెంపాడు పూర్తి చేసుకుని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని,అచ్చంపేట ఎత్తిపోతలతో 2,300 కోటతో అప్పర్ ప్లాట్లకు లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందిస్తామని అన్నారు.గతంలో వలసపోయిన పాలమూరు నేడు జార్ఖండ్, ఒరిస్సా నుంచి వలసలు వస్తున్నారని అన్నారు.15వేల ఎకరమున్న భూమి నేడు 4కోట్లకు చేరుకుందని అన్నారు. కే ఎల్ ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడంతో పచ్చని పంటలు పండిస్తున్న రైతులు గ్రామాలలో బొడ్రాయపండుగకు లక్షల రూపాయలతో సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు.జడ్చర్లలో ఓ ప్రబుద్దుడు..ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో వేస్తా అన్నడని కాని, ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతులను బంగాళాఖాతంలో వేసినట్లు అని అన్నారు.నాడు వీఆర్ఏ నుంచి గిర్దావర్ వరకు రిజిస్ట్రేషన్లకు లంచాలు తీసుకునేవారని, ధరణి వచ్చిన తర్వాత లంచాలు ఆగిపోయాయని తెలిపారు.రైతు భూమి మారాలంటే విఆర్ఓ, కలెక్టరేట్, మంత్రి, సీఎం కూడా మార్చలేరని,రైతు బొటన వేలు ఒత్తితేనే మారుతదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు చనిపోతే 50వేలు, తిరిగితే 10వేలు వస్తంండేనని, 5లక్షలు ఇప్పుడు ఖాతాలో పడుతున్నయని అన్నారు. రాష్ట్రంలో వెయ్యి జూనియర్ రెసిడెన్షియల్ కలాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రైతురాజ్యం అని అన్నారు.మహారాష్ర్టలో ప్రజలు మన పథకాలు అడుగుతున్నరని, తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారని అన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా అన్ని నియోజకవర్గాలకు 4లక్షలు ఇస్తామని చెప్పారు.బీసీ కుటుంబాలకు ఇంటికి లక్ష అందిస్తామని అన్నారు.ఈ బహిరంగ సభలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ రాములు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి, నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి జైపాల్ యాదవ్ వెంకటేశ్వర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాజేందర్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి అబ్రహం డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాంతకుమారి,నాగర్ కర్నూల్ మార్కెట్ చైర్మన్ గంగనమోని కిరన్, గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







