Wednesday, 4 November 2026

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్
కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ :
ధాన్యం సేకరణ యావత్తు ఓ యజ్ఞం లా నే పరిగణించాలనీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే వడ్ల ను మిల్లు కు తరలించాలనీ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శనివారం నాడు ఆయన చిన్న అడిశర్ల పల్లి లో ఉన్న రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. మిల్లర్లు ధాన్యం లోడ్ లను వెన్వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. పీ పీ సీ ల నిర్వాహకులు సైతం ధాన్యం నాణ్యత నిర్దేశ ప్రమాణాల ప్రకారం గా మాత్రమే మిల్లులకు తరలించాలనీ స్పష్టం చేశారు. అనవసరంగా అధిక తేమ తో మిల్లుకు తరలిస్తే, అవాంఛనీయ ఇబ్బందులు ఇరు పక్షాలు ఎదుర్కోవల్సి వస్తుందని అభిప్రాయ పడ్డారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు. ధాన్యం సేకరణ వివరాలను ఎప్పటకప్పుడు నమోదు చేయాలని సూచించారు.