భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల సమావేశం
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (05): మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాకాసి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్చార్జుల, బూత్ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా మరియు అసెంబ్లీ ఇన్చార్జ్ బోసు పల్లి ప్రతాప్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ జనవరి 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీల సమావేశం లో జాతీయ అధ్యక్షులు జేపినడ్డ వర్చువల్ గా సమావేశంలో పాల్గొంటారు కావున ఈ సమావేశానికి గోపాల్ పేట్ మండలంలోని బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరు కావాలని దిశా నిర్దేశం చేశారు. యువమోర్చా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పూర్తిస్థాయి బూత్ కమిటీ సభ్యులు హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అరవింద్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, అశోక్ రెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షులు దిలీప్, ఐటీ సెల్ కన్వీనర్ దామోదర్, శక్తి కేంద్రం ఇంచార్జ్ సురేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులు శివ, అనురాగ్, అఖిల్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొనడం జరిగింది




