Wednesday, 4 November 2026

దళిత రత్న అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

 

 

 

 

 

 

సన్మానం.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్9 బిఆర్ఎస్ ప్రభుత్వంలో నే దళితుల జీవితాలలో వెలుగులు నిండుతాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత అన్నారు.మౌలాలి డివిజన్ భరత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంద భాస్కర్ దళితరత్న అవార్డు తీసుకున్న సందర్భంగా  ఎమ్మెల్యే తమ నివాసానికి పిలిచి  శాలువాతో సన్మానించి అభినందించారు.ఈసందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ.దళిత రత్న అవార్డు తో భాధ్యత పెరిగిందని ప్రజలకు నేను చేసిన సేవలను గుర్తించి అవార్డు రావడానికి కృషి చేసిన దళితరత్న అవార్డు కమిటీ చైర్మన్ జంగా శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ప్రతాప్ కు  కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో చంద్రకాంత్, జానీ సాగర్,రాందాస్ రాజు,బాలస్వామి, లక్ష్మీనరసింహ,సిహెచ్ కృష్ణ,కుమార్, శ్రీనివాస్,ధరన్,దుర్గేష్,సురేష్,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.