దళిత సిఎం అని మోసం చేసింది నిజామా కాదా
కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని అనలేదా
కెసిఆర్ కేబినేటల్‌లో అంతా దద్దమ్మలే అన్న అద్దంకి
హైదరాబాద్,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ ఇస్తే..టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ మోసం చేసిండని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు. అంతేకాదు దళిత సీఎం అని.. దళితులను మోసం చేసిండన్నారు. తెలంగాణ మంత్రులా కంత్రులా..అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మంత్రి మల్లారెడ్డి బూతులు తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కంత్రి మల్లిగాడు ఉద్యమంలో ఎక్కడున్నాడని అన్నారు. రాజీనామా చేయ్..రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు అంటూ మల్లారెడ్డికి సవాల్ విసిరారు. నీ ఇలాకా అయిన మల్కాజ్ గిరి లోనే రేవంత్ రెడ్డి గెలిచారు ..అయినా నీకు సిగ్గు లేదా..అని అన్నారు. దమ్ముంటే గజ్వేల్ లో సీఎం రాజీనామా చేస్తే.. రేవంత్ రాజీనామా చేసి పోటీ చేస్తారని సవాల్ చేశారు. మల్లారెడ్డి వెనుక సీఎం కేసీఆరే వున్నాడన్న అద్దంకి దయాకర్..మంత్రి మండలిలో ఒక్కడు సదువుకున్నోడు లేడని విమర్శించారు. సన్నాసులు, దద్దమ్మలు, సొంతంగా సంతకం పెట్టనోళ్లు..కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారన్నారు. మూడు చింతలపల్లి దళిత వాడల్లో సీఎం ఏం చేశారని ప్రశ్నించారు. మల్కాజ్ గిరి జిల్లాలో సీఎం, మల్లారెడ్డి పీకిందేందన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగి విూ బాగోతం బయటపెడ్తామని హెచ్చరించారు. గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతే..దళితబంధు కూడా సాధ్యం కాదని.. ఎగ్గొటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్..గెలుస్తే ఎంత,ఓడితే ఎంత అంటున్నాడని తెలిపారు. కేసీఆర్ ప్రెస్ విూట్ పెట్టి మాట్లాడే దమ్ములేక.. కుక్కలతో మాట్లాడిస్తున్నారన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుక్కలా కాదు.. గుంటనక్కలా మారిండన్నారు. అంతేకాదు..సాలే గాళ్ళకు భయపడబోమని..మేము కాంగ్రెస్ లోకి పదవులకోసం రాలెదని.. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని వచ్చామని తెలిపారు అద్దంకి. ªుఖా,ఓఎఓ లను బొందపెడ్తామని హెచ్చరించారు. ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా కేసీఆర్ కేబినెట్ చూసి సిగ్గుపడుతోందన్నారు