Monday, 2 November 2026

దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి.

 శంకరపట్నం: జనం సాక్షి మే 31
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వము సిద్ధించి పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించి, విజయవంతం చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాచకొండ శ్రీనివాస్ అన్నారు. బుధవారం శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు హాజరైన ఏవో శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ 2 నుండి 20 రోజులపాటు నిర్వహించే బోయ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని గ్రామాల్లో నిర్వహించి, దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి ఖాజా బషిరోద్దిన్, కేశవపట్నం పశువైద్యాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు అంతం తిరుపతిరెడ్డి పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.