జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలోని మానేరు ఓడ్డున పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ప్రమాదవశాత్తు ఎద్దు తగిలి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కనుకుట్ల నారాయణ మేత కోసం రెండు ఎద్దులను వదిలిపెట్టగా ఒక్క ఎద్దు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి దుక్కిటేద్దు మృతి




