సైదాపూర్: జనం సాక్షి మే30;జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై రాష్ట్ర పంచాయతీల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైదాపూర్ ,హుజురాబాద్ మండలాలకు చెందిన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజభింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. తాగునీరు ,సాగునీరు లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని అన్నారు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాల్లో లబ్ది పొందిన లబ్ధిదారులు పాల్గొనేలా చూడాలని తెలిపారు .విద్యుత్తులో సాధించిన ప్రగతిని రైతులకు, ప్రజలకు వివరించాలని అన్నారు .ఇరిగేషన్ రంగంలో సాధించిన విజయాల్లో రైతులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పిఓ లత, ఎంపీడీవో పద్మావతి, ఎంపీ ఓ సురేందర్ ,పంచాయతీ కార్యదర్శులు, మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, వివిధ గ్రామాల సర్పంచులు ,అధికారులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్




