Wednesday, 4 November 2026

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన దినోత్సవాన్ని విజయవంతం చేయండి మండల అభివృద్ధి అధికారిణి గార్లపాటి జ్యోతిలక్ష్మి

 

మిర్యాలగూడ, జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించే గిరిజన దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ మండల అభివృద్ధి అధికారిని గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో అధికారులు పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రతి తండా, గ్రామపంచాయతీలలో గిరిజన దినోత్సవాన్ని పండుగ వాతావరణం లో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించే విధంగా నిర్వహించుకోవాలని, అదేవిధంగా తండాల నుండి గ్రామపంచాయతీలుగా మారిన గ్రామాలు ఆవాస గ్రామాలలో గత తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని నివేదికల ద్వారా సభలో చదివి వినిపించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చాటి చెప్పే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆమె అధికారులను, పంచాయతీ కార్యదర్శులను సూచించారు. అదేవిధంగా నెల 19వ తేదీ ఆదివారం నిర్వహించే మంచినీటి పండుగ, హరితహారం కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించాలని కోరారు. సమీక్ష సమావేశంలో కార్యాలయ నిర్వహణ అధికారి కరుణాకర్, ఎం పి ఓ వీరారెడ్డి లతో బాటు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.