Monday, 2 November 2026

పటేల్ రమేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్ వద్ద ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించారు. భారీ కేక్ కట్ చేశారు.అనంతరం బాలాజీ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన వేడుకల్లో బాలెంల గ్రామ నాయకులు పటేల్ రమేష్ రెడ్డిని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో ఆయన కలకాలం జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో బాలెంల గ్రామ మాజీ ఉప సర్పంచ్ కంచర్ల వేణురెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ రహమతుల్లా , నాయకులు బీరవోలు సత్తిరెడ్డి , మహమ్మద్ సలీమ్, కంచర్ల శ్రీధర్ రెడ్డి, సట్టు వెంకన్న తదితరులున్నారు.