దౌల్తాబాద్ జూన్ 14 , జనం సాక్షి.ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక ఇబ్బందులతో ఆడబిడ్డ వివాహం చేయడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబానికి చేదోడు గా నిలిచి మానవత్వం చాటుకున్నారు బి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్ప దయాకర్. దౌల్తబాద్ మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య , బూదమ్మ కుమార్తె సుకన్య వివాహనికి పుస్తే,మట్టెలు అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే లక్ష్యంగా ఉమ్మడి మండల వ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగవుతోందని దానిని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని పేర్కొన్నారు. సామాజిక సేవను యువత సామాజిక బాధ్యతగా భావించాలని అలాంటి వారిని ప్రోత్సహించడం సమాజంలో మానవుడిగా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించాలని సూచించారు. మనిషిని చిరస్మరణీయంగా సమాజం గుర్తించుకోదగిన విధంగా తీర్చిదిద్దడానికి సమాజ సేవ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాయం చిన్నదైనా పెద్దదైన సాయం చేసే మనసు ఉండటం గొప్ప విషయమని దైవ సేవ కన్నా మానవసేవ ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సాటి మానవుల పట్ల సహృదయదా సహనం చూపినప్పుడే శాంతి సమస్త సమాజ నిర్మాణ సమాజం స్థాపితం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొక్కల యాదమ్మ,ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు పొట్టల భూషణం, ఆత్మ కమిటీ డైరెక్టర్ సత్తయ్య, బిఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి సత్యం, ఇప్ప ప్రభాకర్,నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పి రామచందర్ గౌడ్,వార్డ్ మెంబర్ మల్లయ్య,నవీన్,బిఆర్ఎస్ కార్యకర్తలు, లస్మయ్య, శ్రీను, రామా గౌడ్, బొక్కల ఎల్లం, యువజన నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద వధువుకు పుస్సె మట్టెలు అందచేసిన ఇప్ప దయాకర్.




