రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ప్రభుత్వ విప్ చెన్నూర్ శాసన సభ్యులు బాల్కసుమన్ ఆదేశానుసారం బీ ఆర్ ఏస్ పార్టీ రామకృష్ణాపుర్ 20వ వార్డు కౌన్సెలర్ అనిల్ రావు అధ్యక్షతన జూన్ నెల 2 నుండి 22 తేది వరకు
నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దిఉత్సవాలను ఉద్దేశించిముందస్తు సమీక్ష సమావేశం ఆదివారం నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇంచార్జీ
గాండ్ల సమ్మయ్య, ఛైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పోగుల మల్లన్న, అనిల్ , రేవెళ్ళి ఓదెలు,పనస రాజు, సీనియర్ నాయకులు యాకూబ్ అలి, శశి, గోపు రాజం, భూమన్న, సత్యనారాయణ,బత్తుల శ్రీనివాస్, జక్కబోయిన కుమార్ , కోఆర్డినేషన్ కమిటి సభ్యులు, వార్డు నాయకులు, మహిళ, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా, కార్యకర్తలు పాల్గొన్నారు




