డోర్నకల్ జూన్ /22/జనం సాక్షి న్యూస్:దశాబ్ది ఉత్సవాల పేరుతో హంగామా చేస్తున్న ప్రభుత్వం కనీసం పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేని అసమర్థచేతగాని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ డోర్నకల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుభాష్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలో మాట దేవుడెరుగు కనీసం పేదవాడికి సెంటు భూమి ఇళ్ల స్థలాలకు పంచిన దాఖలా లేదని ఇళ్ల స్థలాల కోసం పేదవాడు అనేక సంవత్సరాలుగా నిరీక్షణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ పేదలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను పాలక పార్టీ పెద్దలు కాజేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ పేదవాడు ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేస్తే అధికారులు జులుం ప్రదర్శించడాన్ని ఆపి, పేదవాడికి ప్రభుత్వ భూములు పంచాలని, ప్రభుత్వ భూమి లేని దగ్గర కొనుగోలు చేసి పేదవాడికి 100 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాల కోసం లబ్ధిదారుల జాబితాతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ స్వాతి బిందు కి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు, పోగుల శ్రీనివాస్ గౌడ్ ,కే ప్రబేష్ , జన్ని స్వామి ,రాంజీ ,నాగేల్లి రవి ,మల్లికార్జున్ ,బిక్షపతి, లాల్ కుమార్, బాలకృష్ణ, శ్రీనివాస్, జయమ్మ, అన్నపూర్ణ, కల్పన, హిమబిందు, రేణుక, అమరావతి,లక్ష్మి, సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది తెలంగాణలో పేదవాడికి ఇండ్ల స్థలం ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి




