దసరా నాటికి అందుబాటులోకి ఆర్ అండ్ బి అతిథి గృహం

 రాష్ట్ర మంత్రి గంగుల

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :

దసరా నాటికి ఆర్ అండ్ బి అతిథి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులో కి తేవాలని బీసీ సంక్షేమ , పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.

గురువారం ఆర్ అండ్ బి అతిథి గృహ నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావు తో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పురాతన ఆర్ అండ్ బి అతిథిగృహం శిథిలావస్థకు చేరుకున్నదని 10 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో ఆర్ అండ్ బి అతిథి గృహం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ మధుసూదన రాజుకు ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఆర్ అండ్ బి అతిథి గృహ పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థలంలో అందమైన గార్డెనింగ్ ,పార్క్ నిర్మించాలని సూచించారు. మంత్రి గంగుల కమలాకర్ వెంట నగర మేయర్ వై సునీల్ రావు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ , గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు