దాడిని నిరసిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ
రఘునాథ పాలెం జనవరి 12 జనం సాక్షి
క్రిస్టఫర్, అనురాధ న్యాయవాద దంపతులపై జరిగిన దాడిని నిరసిస్తూ గోడపత్రిక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది సిపిఐ నాయకుడు కర్నాటి భాను ప్రసాద్ అతని అనుచర గుండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నిందితులకు కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నీ పటిష్టంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం దళిత బహుజనులపై ఆధిపత్య కులాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు దాడి జరిగి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం అమానుషం అన్నారు. గుంతెటి వీరభద్రం, డాక్టర్ కేవీ కృష్ణారావు,పెరుగు వెంకటరమణ, పద్మాచారి, పాల్వంచ రామారావు లిక్కి కృష్ణారావు, భద్ర నాయక్, డి విజయ్, బాసటి హనుమంతరావు, కొరుపల్లి శ్రీనివాస్ ఎస్కే నజీమా,కొట్టే సుధాకర్, దాసరి శ్రీను, అబ్దుల్ రహమాన్, ఉపేంద్ర, అఖిల్, శ్రీనివాస్ నాయక్, సీతారాం నాయక్, జింగిపల్లి రవి, కామ ప్రభాకర్, చింతమల వెంకటేశ్వర్లు, గాదరి బాబు, నునావత్ హరి సింగ్, రవీందర్ నాయక్, రామారావు కె రామారావు, టీ రమేష్ తదితరులు పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.




