Thursday, 5 November 2026

నూతన సంవత్సర డిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర డిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ*

వీణవంక జనవరి 12 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలోని స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో గురువారం డిటిఎఫ్ మండల అధ్యక్షులు మ్యాకమల్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కనకం. శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి వారు కలిసి 2022-23 నూతన సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అధ్యక్షులు మ్యాకమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 317 జీవోపై వచ్చిన ఆప్పిల్స్ అన్నిటినీ పరిష్కరించి, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నందున అల్పాహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సంపత్ రెడ్డి, ఉపాధ్యాయులు లింగయ్య, రాజశేఖర్, జైపాల్ రెడ్డి, ప్రవీణ్, జయ, సువిత, అరుణ శ్రీ, వీరాచారి, రాజ్ కుమార్, సిఆర్పి నారాయణ తో పాటు తదితరులు పాల్గొన్నారు.