దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
జనంసాక్షి, మంథని : దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు జంగపెల్లి రాజమల్లు అనే రైతు కోరారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమల్లు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తారం మండలం కేసనపల్లి గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న తమ భూమిలో వరి నాటు పనులు నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు తమపై కారపూడి చల్లుతూ కర్రలతో ఇష్టానుసారంగా దాడి చేశారన్నారు. మమ్మల్ని దాడి చేస్తుండగా మా పొలానికి వరి నాటు పనుల కోసం వచ్చిన కూలీలంతా ప్రత్యక్షంగా చూశారన్నారు. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న తమపై అకారణంగా దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.