దాతల సహకారంతో వసతులు
కొత్తగూడ ఆగస్టు 21 జనంసాక్షి: ప్రతి వ్యక్తికి చదువు చాలా ముఖ్యం భవిష్యత్ తరాల కోసం మంచి మనసుతో పేద పిల్లలకు అవసరమైన సుమారుగా 40 వేల రూపాయలతో పిల్లలకు స్కూల్ బెంచీలు,బుక్స్ ను బోరింగ్ తండా లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు తండావాసులు ముందుకు వచ్చి పిల్లలకు అందించడం జరిగింది.దాతలు అజ్మీర రాజు నాయక్ (సాఫ్ట్ వేర్),భూక్య బాలు నాయక్ (బ్యాంక్ ఉద్యోగి),ధరావత్ దేవేందర్ నాయక్ (ఆర్మీ జవాన్),భూక్య పూల్ సింగ్ నాయక్ (వార్డు మెంబర్),అంగోత్ రాజేందర్ నాయక్,(పిసా కమిటీ ఉపాధ్యక్షుడు) వీరు మాట్లాడుతూ పాఠశాలకు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.దాతలను గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు కలిసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హై స్కూల్ పోగులపల్లి లక్ష్మీ నారాయణ హెచ్ఎం పాల్గొని డొనేట్ చేసిన దాతలను సాలువతో సన్మానం చేయడంతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాస్కర్,స్వప్న, వెంకన్న,రజిత,కార్యదర్శి కళ్యాణి,రవీందర్, కవిత గ్రామ పెద్దలు అశోక్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.