జోగులాంబ గద్వాల జిల్లా జర్నలిస్టుల డిమాండ్.
గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 18 (జనం సాక్షి);గత రెండు రోజుల క్రితం షాద్ నగర్ పట్టణానికి చెందిన మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ అనంతరం హత్య చేసిన హంతకులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మంగళవారము జోగులాంబ గద్వాల జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం మల్లాపురం గ్రామానికి చెందిన మాజీ జర్నలిస్టు హత్యకు గురైన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జోగులాంబ టీవీ సీఈఓ,బి.గిరిబాబు, కె.వెంకటేశ్వర్లు, నరేష్ ఈనాడు,శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రజ్యోతి,వార్త రంగమని, కిరణ్ సాక్షి,వెంకటేష్ ఆంధ్రజ్యోతి,ఇస్మాయిల్ జనం సాక్షి, నందు ప్రైమ్ నైన్,రజినీకాంత్ దిశ, వర్మ సూర్య,కృష్ణ మహా న్యూస్, కిషోర్ సిక్స్ టీవీ,సహదేవులు న్యూస్ నైన్,దేవేందర్ రెడ్డి ప్రజా గొంతుక,రాము విశ్వ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.




