Tuesday, 3 November 2026

యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోడిదెలా రాము.

యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోడిదెలా రాము.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్29(జనంసాక్షి):
యువజన కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొడిదల రామును నియమిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కొడిదల రాము మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షులుగా తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు .జిల్లాలో యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు . దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొడిదల రాము ఎంపిక పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.