దివ్యంగులు అదైర్యపడవద్దు.
దివ్యంగా చిన్నారులు పిజియో థెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
యాలాల మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్తా.
తాండూరు డిసెంబర్ 5(జనంసాక్షి)దివ్యంగులు అదైర్యపడవద్దని ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల విద్యావనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దివ్యంగా చిన్నారులు ప్రత్యేకంగా అందిస్తున్న పిజియో థెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు పెన్షన్ వచ్చే విదంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎంపిపి అన్నారు. ఆటలతో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపిడివో పుష్పలీల, ఎం ఈ ఓ సుధాకర్ రెడ్డి, డాక్టర్లు శ్రీకాంత్, షోయబ్, ఐ ఆర్పీ చంద్రకళ, చిన్నారులు పాల్గొన్నారు.
దివ్యంగులు అదైర్యపడవద్దు




