Thursday, 5 November 2026

పంట మార్పిడితోనే అధిక దిగుబడి

పంట మార్పిడితోనే అధిక దిగుబడి.
రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.
తాండూరు డిసెంబర్ 5(జనంసాక్షి) పంట మార్పిడితో నే అధిక దిగుబడి లభిస్తుందని ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం అగ్గనూర్ రైతు వేదికలో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని పురస్కరించుకుని యాలాల మండల వ్యవసా య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజర య్యారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రైతులు ప్రతి సారి పత్తి, కంది పంటలను పండించడం ద్వారా దిగుబడి తగ్గుతుందని, రసాయనాలు ఎక్కువగా వాడడం వలన నెల యొక్క భూసారం తగ్గుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడిగా సంవత్సరానికి ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నారని గుర్తు చేసారు. రైతును రాజు ను చేయాలని ప్రభుత్వం కృషిచేస్తుంద నన్నారు.ఈ కార్యక్రమం లో తాండూరు వ్యవసాయ సంచాలకులు రుద్ర మూర్తి, అగ్గనూర్ సర్పంచ్ బిమప్ప, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, రైతులు పాల్గొన్నారు.