Thursday, 5 November 2026

దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం ఆత్మీయ సమ్మేళనం

* టీవీపీఎస్ వ్యవస్థాపకద్యక్షులు గుండపునేని సతీష్

టేకులపల్లి,జనవరి 17( జనం సాక్షి ): దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసమే దివ్యాంగుల మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండెపునేని సతీష్ పేర్కొన్నారు. యువతలో స్ఫూర్తిని నింపే గొప్ప కార్యక్రమం దివ్యోత్సవం అని అన్నారు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం(టి వి పి ఎస్) ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న దివ్యోత్సవం( దివ్యాంగ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం) ఈనెల 29వ తారీఖున ఆదివారం కొత్తగూడెం క్లబ్ వేదికగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమ పోస్టర్ను మంగళవారం టేకులపల్లి మండలం, వెంకట్యా తండా గ్రామంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గుండపునేని, దివ్యాoగ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు మాలోత్ జగ్గుదాస్, ప్రభుత్వ ఉపాధ్యాయులు బానోతు లక్మా లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాoగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారు అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, ఇండ్లకే పరిమితమైన దివ్యాంగులను ఒకచోట చేర్చి వారిలో వివిధ రంగాలలో దివ్యాంగులు తమ ప్రతిభను చాటుతు, అవయవ లోపం ఉన్న వారిని కృంగిపోకుండా ప్రతి ఒక్కరు వారికున్న అవకాశాలను సాన పెడితే అన్ని రంగాలలో రాణించవచ్చని, వారు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ వేదిక ద్వారా వివాహాలు అంటే ఆర్భాటాలు, ఆడంబరాలు కాదని ఆదర్శంగా ఉండాలనే తలంపుతో ఆదర్శ జంటకు ఈ వేదిక ద్వారా వివాహాన్ని జరపనున్నట్లు తెలిపారు . ఇలాంటి కార్యక్రమాలు దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని, నేటి యువతలో స్ఫూర్తిని నింపుతాయని అన్నారు