.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
ఇంద్రవెల్లి :గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ దర్బార్ హాల్ లో నాగోబ జాతర ఏర్పాట్లపై ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి తో కలిసి ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గోపురాల నిర్మాణ పనులను, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లను కలెక్టర్, పిఓ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన నాగోబ దేవాలయం నిర్మాణం, కోవిడ్ వలన రెండు సంవత్సరాల అనంతరం దర్బారుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 21న రాత్రి మహా పూజ కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ప్రారంభమై 24 న దర్బారు, 28 వరకు జాతర కొనసాగుతుందని తెలిపారు. జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు, మెండపెల్లి, హర్కాపూర్ రోడ్డు పనులు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శానిటేషన్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం నిరంతరం జరిగేలా సిబ్బందిని నియమించాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. వీధి లైట్లు, హైమాస్ లైట్ లను ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్, భౌతిక దూరం పాటించే విధంగా భక్తులకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం తో పాటు, 104, 108 అంబులెన్స్ లను 24 గంటలు అందుబాటులో ఉంచి నిరంతర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించాలని అన్నారు. త్రాగు నీటి సరఫరా సక్రమంగా జరిగే విధంగా, మరుగుదొడ్లు అవసరమైన మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ RWS అధికారులను ఆదేశించారు. దర్బారుకు రాష్ట్ర దేవాదాయ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు రానున్న దృష్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి పొలిసు బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. వీఐపీలు, మహిళలు, పురుషులు ప్రత్యేక క్యూ లైన్లో నాగదేవతను దర్శించుకునే విధంగా పోలీస్ ల సహకారంతో బారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులను జాతరలో నిరంతరం నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, నాగోబా జాతర విజయవంతానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఇదివరకే శాఖల వారిగా సూచించిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మర్రి చెట్టు ప్రాంతం, గోవాడ, దేవాలయ ప్రాంగణ సమీపంలోని మట్టిని చదును చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, విద్యుత్ శాఖ అధికారులని పిఓ ఆదేశించారు. గిరిజన సాంప్రదాయ పూజ కార్యక్రమాలకు అవసరమైన పూజ సామాగ్రి, విద్యుద్దీకరణ, పూలమాల అలంకరణలు, తదితర సామాగ్రి సమకూర్చాలని దేవాదాయ శాఖ ఈ ఓ ను ఆదేశించారు. జాతర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి పోలీస్ మందోబస్తు ఏర్పాటు చేస్తామని ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. అనంతరం శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సమావేశం లో ఆర్డీఓ కె. సురేష్, డిడి దిలీప్ కుమార్, ఆలయ ఈ ఓ ఎం. రాజమౌళి, సర్పంచ్ రేణుక, ఆలయ పీఠాధిపతి వెంకటరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఓ ఎస్ డి కృష్ణయ్య, అదనపు వైద్యాధికారి కొమురం బాలు, ఏవో రాంబాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




