ప్రత్యేక సదుపాయాలతో వారికి ఓటేసే సౌకర్యం
వికలాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్
ఎన్నికల ఐకాన్లుగా పలువురు ప్రముఖుల నియామకం
రాష్ట్ర సీఈఓ రజత్ కుమార్ వెల్లడి
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రకాల దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. వారు ఎలాంటి అవరోధాలు లేకుండా వచ్చి ఓటు వేసేలా చర్య తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. హైదరాబాద్ లోని ¬టల్ టూరిజం ప్లాజాలో ఆయన దివ్యాంగులతో సమావేశం అయ్యారు. 18 ఏళ్ళు నిండి సదరం సర్టిఫికెట్ కలిగిన 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, 7 లక్షల మంది కోసం ప్రత్యేక సదుపాయాలు చేశామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో ఇది మొదటి ఎన్నిక కాబట్టి.. వచ్చే ఎన్నికలకు విూ అంచనాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. డిసేబుల్డ్ ఫ్రెండ్లీ ఇన్ కంట్రీగా తెలంగాణను చేస్తామన్నారు. 4 లక్షల 13 వేల మంది ఓటర్లు వికలాంగులుగా నమోదు చేసుకున్నారని రజత్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారుల సూచన మేరకు పోలింగ్ రోజున 10-15 వేల వీల్ చైర్స్ అందుబాటులో పెడతామన్నారు. అత్యధికంగా 8 వీల్ చైర్స్ ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఉంచుతామని వివరించారు. వికలాంగుల ప్రత్యేక అవసరాల కోసం నిధులు ఉంటాయని, వాటిని ఉపయోగిస్తామన్నారు. వికలాంగుల కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎక్కడ ఎంతమంది వికలాంగులు ఉంటారో తెలుసు కాబట్టి ఆటోలు అందుబాటులో పెడతామన్నారు.వికలాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ పెడతామని, వాదా యాప్ ను వాడుతామని, బధిరులకు ప్రత్యేక కరపత్రాలు ముద్రిస్తున్నామని రజత్ కుమార్ చెప్పారు. ఎన్నికల అధికారులు అందరికి ప్రాథమిక సైన్ లాంగ్వేజ్ పై అవగాహన కల్పించామని వెల్లడించారు. వికలాంగుల కోసం సీఈఓ తెలంగాణ వెబ్ సైట్ రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.ఎన్నికల రాష్ట్ర ఐకాన్ గా హీరోయిన్ అభినయను నియమించామని.. క్రికెటర్లు ఆంజనేయులు, మహేంద్ర, సింగర్ శ్రావ్య, టీవీ యాంకర్ సుజాత, శాస్త్రవేత్త బాబు నాయక్ కూడా ఐకాన్లుగా ఉంటారని రజత్ కుమార్ చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా ఐకాన్స్ ఉంటారని తెలిపారు. సానియా విూర్జా, పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్, గోరేటి వెంకన్నతో పాటు సినీ నటుడు విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ కు ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించామన్నారు. వీరంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, ఇందులో వ్యాపార కోణం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కు సంబంధించి హెల్ప్ లైన్ 1950 నెంబర్ ఉందని, జిల్లా కేంద్రాలలో కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని రజత్ కుమార్ వెల్లడించారు. సీఈఓ తెలంగాణ వెబ్ సైట్ లో దివ్యాంగులకు సంబంధించిన వివరాలు
అందుబాటులో ఉంచుతామన్నారు. సి-విజిల్ ద్వారా ఇప్పటివరకు 1457 ఫిర్యాదులు వచ్చాయని, ఎన్నికలు జరుగుతున్న 5 రాష్టాల్లో మన రాష్ట్రంలోనే ఇవి అధికం అన్నారు. పింక్ పోలింగ్ కేంద్రాలలో పింక్ కలర్ ఉండదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ఒక పింక్ పోలింగ్ స్టేషన్ ఉంటుందని చెప్పారు. వికారాబాద్ లో జరిగిన రాజకీయ హత్యపై తమకు సమాచారం లేదన్నారు.




