దిశ నిందితుల కాల్చివేత
హైదరాబాద్: దిశ నిందితలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.
అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు తమ బుద్దిని చూపించి పోలీసులపై దాడికి దిగారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను హై సెక్యూరిటీ మధ్య వేరువేరుగా ఉంచారు. నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగితా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. నిందితులు తుపాకులు లాక్కొని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు.