సాహో సజ్జనార్ అంటున్న నెటిజన్లు
ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షాతిరేకాలు
హైదరాబాద్,డిసెబర్6(జనంసాక్షి): నాడు వరంగల్‌లోనూ..నేడు షాద్‌నగర్ ఘటనలోనూ హీరో సివి సజ్జన్నార్ అన్న విసయం గుర్తించాలి. తాజాగా షాద్‌నగర్ ఘటనలోనూ సజ్జన్నార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వరంగల్ ఎన్/-కౌంటర్‌లోనూ ప్రశంసలు వచ్చాయి.ఈ రెండు ఎన్‌కౌంటర్లు సజ్జనార్ నేతృత్వంలోనే జరగడంతో ఆయనపై ఇంటర్నెట్‌లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2008లో ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు. ఆ సమయంలో వరంగల్‌లో ఇద్దరి విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది. ఘటనకు ఎస్ శ్రీనివాసరావు(25), పి. హరికృష్ణ(24), బి.సంజయ్(22) అనే ముగ్గురు యువకులను బాధ్యులుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 48 గంటల్లోనే పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్ కూడా డిసెంబర్ నెలలోనే జరగడం గమనార్హం. నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై నిందితులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, యాసిడ్ చల్లేందుకు ప్రయత్నించారని… అందువల్లే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ ముగ్గురిని కాల్చేశారని అప్పట్లో వరంగల్ ఎస్పీగా ఉన్న వీ.సీ.సజ్జనార్ వివరణ ఇచ్చారు. తాజాగా షాద్‌నగర్‌లో జరిగిన ‘దిశ’ ఘటన నిందితులను
పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై మెజార్టీ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా వైఎస్ హయాంలో వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు సజ్జన్నార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. ఈ రెండు ఘటనల్లో ప్రజలు సజ్జన్నార్ చర్యను సమర్థించడం విశేషం.’దిశ’ ఘటనలో నిందితులను కూడా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్న సమయంలోనే ఎన్‌కౌంటర్ చేయడంతో ‘సజ్జనార్.. ది ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సీన్ రీకన్‌స్టక్షన్ర్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారని, తమపై రాళ్లు రువ్వారని.. ఆయుధాలు లాక్కునేందుకు యత్నించారని పోలీసులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందినట్లు చెప్పారు. దిశను కాల్చివేసిన ప్రాంతంలోనే నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు సమాచారం. పోలీస్ కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం గమనార్హం. నిజానికి ఈ రాక్షసులను పట్టుకున్న రోజే కాల్చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. వరంగల్ లాగే ఇక్కడా ఎన్‌కౌంటర్ చేయండని సజ్జన్నార్‌ను ఆనాడే ప్రజలు కోరారు. అదే జరగడంతో ప్రజలు సమజంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు.




