హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): నగరంలో తూనికలు కొలతలశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా చేపట్టిన సోదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన స్వీట్ దుకాణాలు, పటాకుల దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలపై అధికారులు 270 కేసులు నమోదు చేశారు. ఒక్క స్వీట్ దుకాణాలపైనే 170 కేసులు అదేవిధంగా 89 పటాకుల దుకాణాలపై 90 కేసులు నమోదయ్యాయి. ప్యాకేజీ వస్తువుల చట్ట నియమాలను అనుసరించి అధికారులు కేసులు నమోదు చేశారు.




