దున్నపోతుకు వినతి పత్రం
జనం సాక్షి/ కొల్చారం మండలం ఐ ఎమ్ ఎల్ డిపో వద్ద వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఐఎంఎల్ డిపోలో స్థానికులకే హమాలీ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ చిన్న గణపురం గ్రామస్తులు గత 94 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో నేడు విందుతున్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు దున్నపోతుకు వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఐఎంఎల్ డిపోలో స్థానికులకే హమాలీ ఉద్యోగం కల్పించాలని లేనిపక్షంలో ఉద్యోగాలు కల్పించే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు




