పీర్జాదిగూడ రెడ్డి ఐక్య వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ 

మేడిపల్లి – జనంసాక్షి
పీర్జాదిగూడ రెడ్డి ఐక్య వేదిక 2023 క్యాలెండరును బుధవారం రోజు న మేయర్ జక్కా వెంకట్ రెడ్డి చేతుల మీదు గా  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్డి ఐక్య వేదిక క్యాలెండర్ అద్భుతంగా తీర్చి దిద్దారని ప్రశంసించారు. రెడ్డిల అభ్యున్నతి కోసం నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వేదిక ద్వారా పిర్జాదిగూడలో ఉన్నటువంటి పేద రెడ్లను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించే విధంగా మనందరం కృషి చూద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షులు చాడ సురేందర్ రెడ్డి, ఏవి ఇన్ఫ్రా ప్రైడ్ అధ్యక్షులు రాజీడీ వెంకట్ రెడ్డి, రాజీడీ రాజేష్ రెడ్డి, గుడి సంజీవ్ రెడ్డి, మొగుళ్ళు మనోహర్ రెడ్డి, టౌటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఏలూరు శంకర్ రెడ్డి, రాజీడీ శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంపత్ రెడ్డి, నాగిళ్ళ జైపాల్ రెడ్డి, దొంతి నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.