జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) జూన్ 10 : గద్వాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ ఆదేశాల మేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని 7వ వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ విష్ణుప్రియ దౌలు ఆధ్వర్వంలో పార్టీ నాయకులతో కలిస వార్డులో ఇంటింటికి వెళ్లి 12వ తేదీ సోమవారం నాడు సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో జిల్లా నూతన సమీకృత భవనాలు, నూతన ఎస్పీ కార్యాలయం ,నూతన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు అయిజ రోడ్డు మేళ్లచెర్వు చౌరస్తా సమీపంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని కావున వార్డులోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఇంటింటికి తిరిగి బహిరంగ సభ ఆహ్వాన పత్రాలు అందించి కోరారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జయకృష్ణ ,మధు బాబు,గుంటిపల్లె రాము ,మనోజ్ కుమార్ ,కబడ్డీతిరుపతి,చంద్రాములు,డీలర్ శ్రీను ,గట్టు దౌలు, కార్యకర్తలు యూత్ సభ్యులు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం ప్రగతి నివేదన సభను విజయవంతం చేయండి : కౌన్సిలర్ విష్ణుప్రియ దౌలు




