రఘునందన్ రావు. జనం సాక్షి దుబ్బాక
దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేసి
పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.అలాగే పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఉన్న సంపు పనులను పరిశీలించారు.
నిరుపయోగంగా ఉన్న సంపుపై పైకప్పు వేయడంలో నిర్లక్ష్యం చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వయంగా తానే దగ్గరుండి తన సహాయ సిబ్బంది మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రమాదకరంగా నిరుపయోగంగా ఉన్న సంపుపై పై కప్పును పెట్టించారు.పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, స్కూలు ప్రారంభమైన చిన్నపిల్లలకు ఇబ్బందికరంగా ఉన్న సంపు మరియు ఇతర నిర్మాణ పనులలో నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయుల రిజిస్టర్లను పరిశీలించారు.
పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే




