Friday, 6 November 2026

విజయబంద్ వంతం

విజయబంద్ వంతం……….. చొప్పదండి ,జనం సాక్షి, అక్టోబర్ 27: చొప్పదండి మున్సిపల్ పరిధిలో పెరిగిన ఆస్తి పనులకు నిరసనగా గురువారం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ బంద్ విజయవంతమైంది. తెల్లవారుజాము నుండి పట్టణంలో వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బందులో పాల్గొని ఐకాస సమితి సభ్యుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో ఉన్న ఆస్తి పనుల కన్నా మున్సిపల్ గా మారిన తర్వాత వస్తున్న ఆస్తి పనులతో పన్నులు కట్టలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన పనులను కొంతమేరకు తగ్గించేంతవరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐక్య కార్యచరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.