హైదరాబాద్: దూరదర్శన్‌లో ఉద్యోగాలు కల్పిస్తానని ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించిన సైబరాబాద్ పోలీసులు నిందితుడు వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కంప్యూటర్,ఫ్రింటర్, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.




