న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్‌సి గోయల్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనీల్ గోస్వామి రాజీనామాతో ఖాళీ అయిన హోంశాఖ కార్యదర్శి పదవిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను నియమించింది. గోయల్ కేరళ కేడర్‌కు చెందిన 1979వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. యూపీఏ హయాంలో కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఆయన పని చేశారు. ఇప్పుడు ఆయన హోంశాఖ కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు.
నిన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా అనీల్ గోస్వామి పనిచేశారు. శారదా స్కామ్ కేసులో సీబీఐ విచారణలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.




