దేవరకద్ర నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త చెప్పిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 13 (జనం సాక్షి) దేవరకద్ర నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్థానిక ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి తన సొంత ఖర్చులతో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ కంపిణిలలో ఉద్యోగాలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువతకు ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ చక్రవర్తి ఈ క్లాసెస్ రూమ్ ఆన్లైన్ ఆప్ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తున్నరు . ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ / డిప్లొమా / ఐటిఐ, ఏదైన డిగ్రీ , ఏదైన పీజీ చేసిన విద్యార్థులందరూ తమ ఉచిత కోచింగ్ లో జాయిన్ అవ్వడానికి అర్హులన్నారు . మన ఉచిత కోచింగ్ యాప్ లో కేంద్ర, , రాష్ట్ర ప్రభుత్వ పోటీ పోటీ పరీక్షల సిలబస్ ప్రకారం వీడియోలు ఉంటాయనీ. ప్రతి సంవత్సరం 57 రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగా పోటీ పరిక్షలతో పాటు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలకు, ఉద్యోగుల ప్రమోషన్ పరీక్షలకు మరియు వివిధ విద్యా పోటీ పరీక్షలకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు . మన ఉచిత కోచింగ్ యాప్ లో జాయిన్ అవ్వడానికి ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఈనెల 25 లోపు నమోదు చేసుకోవలని ఆయన కోరారు . అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు .