పోచమ్మ గుడి రోడ్డును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
జైపాల్ రెడ్డి : శామీర్ పేట్, జనం సాక్షి : పోతాయి పల్లి లోని పోచమ్మ గుడి రోడ్డును కబ్జాకు గురైన 15వ వార్డు కౌన్సిలర్, అధికారులు నిమ్మకు నీరేతినట్లు వ్యవహరించడం సిగ్గు చేటని తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపల్ పరిధిలోని పోతాయిపల్లి లో యన్.మోహన్ రెడ్డి అనె వ్యక్తి కి సంబంధించిన భూమి సర్వే నంబర్ 68/ఆ 1.31 గుంటల ఉన్నది.భూమికి దగ్గర్లో పోచమ్మ గుడి ఉన్నది.ఆ గుడికి సంబంధించిన భూమి మరియు వెళ్ళడానికి దారి ఉండేది. యన్.మోహన్ రెడ్డి అనేవ్యక్తి గుడికి సంబంధించిన కొంత భూమిని మరియు వెళ్లే రోడ్ ను కబ్జా చేశాడు.గుడికి వెళ్లడానికి భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది.ఈ ఆదివారం బోనాల పండుగ ఉన్నందున భక్తులు బోనాలు తీసుకెళ్లడానికి రోడ్ లేదు.అధికారులు గాని స్థానిక 15 వ వార్డు కౌన్సిలర్ హరిబాబు గాని ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి కబ్జాకు గురైన భూమిని, రోడ్ ను కాపాడగలరని ప్రజలు కోరుతున్నారు.